AP News: అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

Updated : 11 Oct 2021 12:56 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు దర్శనాలు నిలిపేయనున్నారు. 2 గంటల నుంచి రాత్రి 11 వరకు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో అభయమిస్తారు. ఉ.11 గంటలకు వినాయక గుడి వద్ద క్యూలైన్‌ నిలిపేశారు. క్యూలైన్‌లో ఉన్నవారికి మధ్యాహ్నం 12 గంటల్లోపు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారమని ప్రతీతి. నవరాత్రులు సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు రేపు మూలానక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో ఆలయం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని