Simhachalam: సింహగిరిపై కూలిన సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభం

సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానం ఉప దేవాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కూలిపోయింది..

Updated : 11 Aug 2021 13:49 IST

సింహాచలం: సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానం ఉప దేవాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కూలిపోయింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చిపోవడంతో అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని