Karvy: రూ.700 కోట్ల కార్వీ షేర్లను స్తంభింపజేసిన ఈడీ

స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్తంభింపజేసింది.

Updated : 25 Sep 2021 15:57 IST

హైదరాబాద్‌: స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్తంభింపజేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.700కోట్ల విలువైన షేర్లను నిలిపివేసింది. హైదరాబాద్‌ సీసీఎస్‌, సైబరాబాద్‌ పరిధిలో కార్వీపై బ్యాంకులు ఫిర్యాదు చేశాయని ఈడీ పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. కార్వీ సంస్థ షేర్‌ హోల్డర్ల షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.2,873 కోట్ల రుణాలు తీసుకుందని ఈడీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కార్వీ రుణం పొందిందని.. బ్యాంకుల రుణాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రూ.700 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేసినట్లు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని