విశాఖలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌: సీఎంను కలిసిన కైనెటిక్‌ ప్రతినిధులు

రాష్ట్రంలో రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్‌, అధునాతన టెక్నాలజీతో బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది

Published : 02 Oct 2021 01:46 IST

అమరావతి: రాష్ట్రంలో రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్‌, అధునాతన టెక్నాలజీతో బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈవో ఫిరోదియా మొత్వాని, కో ఫౌండర్‌ రితేష్ మంత్రి సంస్థ ప్రణాళికలను సీఎం జగన్‌కు వివరించారు. భేటీలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకూ కైనటిక్‌ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. ఇప్పటికే పుణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6వేల ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ని ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని