Ts News: తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి.. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

నగరంలో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ ఈవీ పరిశ్రమ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది....

Published : 07 Oct 2021 19:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ ఈవీ పరిశ్రమ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. రూ.2,100 కోట్లతో ఈవీ యూనిట్‌ను ప్రారంభిస్తామని ట్రిటాన్‌ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ట్రిటాన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు