Warangal: ఉచిత పోలీసు శిక్షణ అర్హత పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఎలా ఉందో హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. పోలీసు నియామకాల కోసం వరంగల్‌

Updated : 30 Sep 2021 19:26 IST

వరంగల్‌: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఎలా ఉందో హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. పోలీసు నియామకాల కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్‌ కోసం గురువారం అర్హత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యేందుకు యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పరీక్షకు మొత్తం 6,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు గురువారం వరంగల్‌, హనుమకొండ, నర్సంపేట, పరకాల, జనగాం పట్టణాల్లో అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో నిర్వహించారు. ఈ అర్హత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేయనున్నట్టు  పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. ఉచిత శిక్షణ కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 6 కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని