Updated : 29 Oct 2021 16:55 IST

Ts News: ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌: మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ రంగంలో భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఈవీ ట్రేడ్ ఎక్స్ పో’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లన్నీ కలియతిరిగి టూవీలర్ విద్యుత్ స్కూటర్లను మంత్రి స్వయంగా నడిపి పరిశీలించారు. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన అవసరం ఉందని.. తద్వారా కాలుష్య కోరల నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలకు అతిపెద్ద సవాల్‌గా ఉన్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసేలా రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఎక్స్ పోల ద్వారా ఈవీ వాహనాల అమ్మకాలతో పాటు.. మార్కెట్లో నెలకొన్న ట్రెండ్‌పై కొనుగోలుదారులకు ఒక అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్స్ పోలో టాటా, ఎంజీ, ఈటో, ఆటం వంటి పలు కంపెనీలు వాటి మోడళ్లను ప్రదర్శించాయి.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని