Fake Wedding Guests: పెళ్లికి నకిలీ అతిథులు.. అదో వ్యాపారం తెలుసా..?

జీవితంలో మరో బంధంలోకి అడుగుపెట్టే వేడుక వివాహం. దీన్ని సాధ్యమైనంత అందంగా మలచుకోవాలని ప్రతిఒక్కరు కలలుకంటారు. ఆ వేడుకలో తమ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. వధూవరుల ముస్తాబు, పెళ్లి మండపం అలంకరణ, వంటలు, అతిథి మర్యాదలు ఇలా ప్రతిదానిలో తమ హోదా కనిపించేలా చూసుకుంటారు.

Updated : 15 Dec 2022 15:04 IST

ఎక్కడంటే..?

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో మరో బంధంలోకి అడుగుపెట్టే వేడుక వివాహం. దీన్ని సాధ్యమైనంత అందంగా మలచుకోవాలని ప్రతిఒక్కరు కలలుకంటారు. ఆ వేడుకలో తమ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. వధూవరుల ముస్తాబు, పెళ్లి మండపం అలంకరణ, వంటలు, అతిథి మర్యాదలు ఇలా ప్రతిదానిలో తమ హోదా కనిపించేలా చూసుకుంటారు. దక్షిణ కొరియా వాసులు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోరు. అక్కడివారు ఎంత ఎక్కువమంది అతిథులు హాజరైతే అంత గొప్పగా భావిస్తుంటారు. ప్రజల మనసును కనిపెట్టిన కంపెనీలు దీన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాయి. అలా పుట్టుకొచ్చిందే ఫేక్ వెడ్డింగ్ గెస్ట్స్‌( నకిలీ వివాహ అతిధులు) వ్యాపారం. 

 వివాహ తంతు వరకు మొత్తం కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు వెడ్డింగ్ ప్లానర్లు. అదే తరహాలో ఈ కంపెనీలు వధూవరులు కోరిన మేరకు నకిలీ వెడ్డింగ్ గెస్ట్‌లను అందుబాటులో ఉంచుతారు. వారు పెళ్లిలో కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూసుకుంటారు. తామే ఈ పెళ్లి అతిథులం అన్నట్లు దర్జాగా కూర్చుంటారు. దాంతో తమ తరఫు పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని వధూవరుల కుటుంబాలు సంతృప్తి పడగటంతో పాటు.. ఇటు కంపెనీల జేబులు నిండుతాయి.  

ఇప్పుడు దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను సడలించింది. వివాహానికి హాజరయ్యే అతిథుల సంఖ్య 99కి పెంచింది. మున్ముందు ఆ సంఖ్యను 250కి పెంచే యోచనలో ఉంది. ఈ క్రమంలో నకిలీ వెడ్డింగ్ గెస్ట్‌ల వ్యాపారం మళ్లీ పుంజుకుంటోందని అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. నకిలీ గెస్టుల కోసం గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఓ కంపెనీ ఉద్యోగి వెల్లడించారు. అలాగే టీకా వేశాకే వారిని అతిథులుగా పంపుతున్నట్లూ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని