TS News: ప్రాజెక్టు పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు.. సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను గూడాటిపల్లి భూ నిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేయరాదంటూ

Updated : 23 Dec 2021 16:41 IST

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను గూడాటిపల్లి భూ నిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేయరాదంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తరలివచ్చారు. ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్థులు శాంతించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట.. లాఠీ ఛార్జికి దారితీసింది.  పరిహారం అందిన తర్వాతే ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఘర్షణలో హస్నాబాద్ ఎస్‌ఐ శ్రీధర్‌ తలకు గాయమైంది. ఇదే ఘర్షణలో గూడాటిపల్లి వాసులకు స్వల్ప గాయాలయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు