TS News: వేములపల్లిలో టోకెన్ల కోసం రైతులు బారులు

నల్గొండ జిల్లాలో వరి రైతులను టోకెన్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వరి కోయాలంటే తప్పనిసరిగా

Updated : 24 Sep 2022 16:27 IST

వేములపల్లి: నల్గొండ జిల్లాలో వరి రైతులను టోకెన్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వరి కోయాలంటే తప్పనిసరిగా టోకెన్‌ తీసుకోవాలని నిబంధనను వ్యవసాయశాఖ తీసుకురావడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. వేములపల్లి రైతు వేదిక వద్ద తెల్లవారుజాము నుంచి రైతులు వేచి ఉన్నారు. పరిమిత సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని.. పరిమిత టోకెన్లు కాకుండా గ్రామాలు, క్లస్టర్ల వారీగా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి రుషేంద్రమణి మాట్లాడుతూ.. టోకెన్లు పొందిన రైతులు మాత్రమే మిల్లుల వద్దకు ధాన్యాన్ని తరలించాలన్నారు. 6, 7, 8 తేదీలకు సంబంధించిన 600 టోకెన్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. టోకెన్లు లేని రైతులు తమ పంట కోయొద్దని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని