
AP News: పూజలు చేస్తూ కొండపై నుంచి జారి పడి పూజారి మృతి
శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి పూజారి పాపయ్య సుమారు 40 అడుగుల కిందకు జారిపడి మృతి చెందారు. స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ ఘటన జరిగింది. ఎత్తైన కొండల మధ్య గంపమల్లయ్య స్వామి కొలువై ఉంటారు.
ఏటా శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎలాంటి ఆధారం లేకుండా కొండపై నుంచి కిందకి దిగి పూజ చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్రమంలో పూజలు నిర్వహిస్తుండగా పూజారి ప్రమాదవశాత్తు కొండపై నుంచి పడి మృతి చెందడం అక్కడ ఉన్న భక్తుల్లో విషాదం నింపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.