Ts News: 7 వర్సిటీల్లో పీజీ కన్వీనర్‌ కోటా మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల్లో మొదటి విడత సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 23,647 సీట్లు కేటాయించగా.. మరో   24,278 మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూల్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలకు...

Updated : 06 Dec 2021 21:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల్లో మొదటి విడత సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 23,647 సీట్లు కేటాయించగా.. మరో   24,278 మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూల్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలకు ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. 7 వర్సిటీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 47,925 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌లో ఉత్తీర్ణులైన 32,400 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. మొదటి విడతలో 23,647 మందికి సీట్లు దక్కాయి. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. వచ్చిన సీటుతో సంతృప్తి చెందితే కాలేజీలో చేరాలని.. లేదంటే రెండో విడత కోసం వేచి చూడవచ్చునన్నారు. కళాశాలల్లో చేరాలనుకొనే అభ్యర్థులు టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలని.. విద్యార్హత ధ్రువపత్రాలు ఒరిజినల్ ఇవ్వకూడదన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని కళాశాలల యాజమాన్యాలకు కన్వీనర్ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని