Ap News: తిరుపతిలో వరదనీటి నిల్వతో కుంగుతున్న ఇళ్ల పునాదులు

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తిరుపతి నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ఇళ్ల పునాదులు కుంగుతున్నాయి...

Published : 27 Nov 2021 17:48 IST

తిరుపతి: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తిరుపతి నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ఇళ్ల పునాదులు కుంగుతున్నాయి. తిరుపతి శ్రీకృష్ణా నగర్‌లోని 8వ క్రాస్‌లో 18 ఇళ్లకు గోడలు పగళ్లు ఏర్పడ్డాయి. మూడంతస్తుల భవనం గోడలు బీటలు వారడంతో కూలిపోయే స్థితికి చేరింది.  బీటలు వారిన భవనం సమీపంలోని ఇళ్లపై పడే అవకాశం ఉండటంతో కూల్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు నిల్వ ఉండటంతో పాటు బలహీనమైన నిర్మాణాలతో భవనాలు కూలిపోయే పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. తమ ఇల్లు కూల్చవద్దని భవన యజమాని అధికారులను వేడుకున్నారు. ఇళ్ల పునాదులు కుంగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్‌లో ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్‌రెడ్డితో పాటు తెలుగుదేశం నేతలు పరిశీలించారు. వరదతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని