Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో ఊడిపోయిన గేటు
పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయింది.
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నంబర్ గేటు ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వెళ్తోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉంది. నీరు ఎక్కువగా ఉండటంతో కొత్త గేటు అమర్చడం సాధ్యంకాదు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్ పరిజ్ఞానంతో తాత్కాలికంగా నీటిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. పోలవరం నుంచి నిపుణులను పిలిపించామని, రేపటిలోగా ఊడిపడిన గేటును తిరిగి బిగిస్తామని చెప్పారు. ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేసిన దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు తగ్గితే గేట్ మరమ్మతులు చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. అలానే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉన్నందువల్ల తీర ప్రాంత ప్రజలు వాగులు, కాలువలు దాటవద్దని గుంటూరు కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ముంపు ప్రాంత అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు