TS News: జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకమండలి సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి

Updated : 18 Dec 2021 11:25 IST

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకమండలి సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైంది. కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న కౌన్సిల్ మీటింగ్‌లో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నాయి. గ్రేటర్ కార్పొరేషన్ సమస్యలపై చర్చ జరపాలని భాజపా కార్పొరేటర్లు ఇటీవల ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సమావేశానికి అధికారులు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు