TS NEWS: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ..

Updated : 12 Aug 2021 20:50 IST

హైదరాబాద్‌: సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అందరికీ  ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఈనెల 31లోపు విధుల్లో చేరాలని తెలిపారు. దీంతో మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన 1,082 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరనున్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో సింగరేణిలో పనిచేస్తున్న 43,899 మందికి ప్రయోజనం చేకూరనుంది.

సింగరేణి కార్మికులకు సంబంధించి పదవీ విరమణ వయసు పెంపు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ గత నెల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఉద్యగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి తాజాగా సింగరేణి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని