Ts News: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు. నూతన ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007

Published : 02 Oct 2021 01:43 IST

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు. నూతన ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించింది. సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా... సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యాన భాండాగారంగా అవతరించిన నేపథ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, కీలక ఉద్యాన రంగంలో ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ఏకైక అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా  అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లొమో కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి వీలు కల్పించారు. ఫలితంగా ఇక్కడ చదివే విద్యార్థులకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు, గుర్తింపు లభించనుంది. దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యానరంగంలో ఉన్న డిమండ్‌, అవకాశాల దృష్ట్యా.. ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే ఈ వృత్తి విద్యా నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని