AP News: అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన సీఐ

పోలీస్‌ యూనిఫాం ఒంటిపై ఉందన్న ధ్యాస లేకుండా ఫక్తు రాజకీయనాయకుడిలా వ్యవహరించారు ఓ పోలీసు అధికారి. అధికార పార్టీ కార్యకర్తలాగా ఎమ్మెల్యేను పొగడ్తలతో ..

Updated : 29 Sep 2021 13:24 IST

గుత్తి: పోలీస్‌ యూనిఫాం ఒంటిపై ఉందన్న ధ్యాస లేకుండా ఫక్తు రాజకీయనాయకుడిలా వ్యవహరించారు ఓ పోలీసు అధికారి. అధికార పార్టీ కార్యకర్తలాగా ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన గుత్తి సీఐ రాము.. ఆహా.. ఓహో అంటూ ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విధుల్లో ఉన్న సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని