
AP News: దుర్గమ్మ సేవలో గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి గవర్నర్ తొలిపూజలు చేశారు. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఉపశమనం పొందాలన్నారు. కరోనా నుంచి విముక్తి కలగాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గవర్నర్ తొలిపూజతో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు భక్తులకు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.