AP News: జగన్‌ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి

జగన్‌ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు...

Updated : 27 Nov 2021 17:15 IST

అమరావతి: ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కాదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీపై ప్రతిపాదనలు సమర్పించేందుకు వారంలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్‌ 21న సీఎం జన్మదినాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఆవిర్భావ దినంగా నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం తన వెసులుబాటును బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అమరావతిలో సమాఖ్య ప్రతినిధులతో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘పీఆర్సీపై నిర్ణయం కోసం ప్రతిపాదనలు కోరే అవకాశం ఉంది. 40 శాతం వరకు ఫిట్‌మెంట్‌ కోరాలని భావిస్తున్నాం. 2022 జనవరి నుంచి జీతంతో పాటు బకాయిలను నగదు రూపంలో ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తాం. వర్సిటీలు, ఆదర్శ పాఠశాలలు, ఇతర కార్పొరేషన్ల ఉద్యోగులకు అలాగే చెల్లించాలని కోరతాం. హెచ్ఆర్‌ను తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలి. పొరుగు సేవల ఉద్యోగులకు కూడా సమాన వేతనానికి డిమాండ్‌ చేస్తాం. సమాన వేతనానికి 92 సంఘాల నిర్ణయం తీసుకున్నాం. సీపీఎస్‌ అంశం త్వరలోనే తేల్చాలని కోరతాం. డిసెంబర్‌ 10లోగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుంది. ప్రకటన రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని ఉద్యోగ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని