
Updated : 29 Dec 2021 13:38 IST
TS News: కేవలం ఒక డోస్ వల్ల ఉపయోగం ఉండదు: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ తొలి డోస్ 100 శాతం పూర్తికావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. కేవలం ఒక డోస్ వల్ల ఉపయోగం లేదని.. సరైన సమయానికే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజల్ని ఆమె కోరారు. హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీ అర్బన్ పీహెచ్‌సీని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీకా తీసుకోని వారిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ కచ్చితంగా ధరించాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తమిళిసై కోరారు. 2022 ఆరోగ్య నామ సంవత్సరంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.
Tags :