GRMB: జలసౌధలో కొనసాగుతోన్న జీఆర్‌ఎంబీ సమావేశం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌ జలసౌధలో జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌

Updated : 11 Oct 2021 15:31 IST

హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌ జలసౌధలో జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చిస్తున్నారు. పెద్ద వాగు ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకొనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ నెల 14 నుంచి కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్‌ అమల్లోకి రానుంది. బోర్డుల పరిధిలోకి రానున్న ప్రాజెక్టులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 
ఈ నెల 14 నుంచి గెజిట్‌ అమల్లోకి రానుందని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైన రజత్‌ కుమార్‌ రాష్ట్ర అభిప్రాయాలు వివరిస్తామన్నారు. గెజిట్‌ అమలు వాయిదా వేయాలని సీఎం.. కేంద్ర జలశక్తి మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారని తెలిపారు. గోదావరిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళుతుందని.. ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తారని రజత్‌కుమార్‌ చెప్పారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు 13వేల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్న రజత్‌కుమార్‌.. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు వెళుతుందని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని