KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు

Updated : 24 Jul 2021 16:25 IST

హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప ఆస్తి ఆరోగ్యం అని.. దాని కోసం కలుషితం లేని గాలి, నీరు, ఆహారం కావాలని సభాపతి అన్నారు. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన పార్టీలకతీతంగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ నేతృత్వంలో కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని తెరాస కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి ఐదో వార్డులో మొక్కలు నాటారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని