
నోరూరించే భేల్‌పూరీ తినాలని ఉందా..అయితే ఇక్కడి వెళ్లండి..!
ఇది హర్షగోయెంగా సూచన
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా నెటిజన్లను మెప్పించే సందేశాలు పోస్టు చేస్తుంటారు. ఈ వారాంతంలో స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్పి, నోరూరించారు. ఈ భేల్‌పూరీ తినాలంటే కోల్‌కతా వెళ్లినప్పుడు ప్రయత్నించండని ట్వీట్ చేశారు.
‘భేల్‌పూరీ టోస్ట్ నాకిష్టమైన స్ట్రీట్ ఫుడ్. అన్నింటిలోకెల్లా కోల్‌కతాలో తయారు చేసే ఆ చిరుతిండి రుచి అమోఘం. బ్రెడ్ ముక్కపై బంగాళదుంప, ఉల్లి, కొబ్బరి ముక్కలు, వేరుశెనగ, చింతపండు చట్నీ, చిల్లీ చట్నీ, భుజియా వేసుకొని తింటే దాని రుచే వేరు. మీరు కోల్‌కతా వెళ్తే తప్పక ప్రయత్నించండి’ అంటూ భేల్‌పూరీ విక్రయిస్తోన్న ఓ చిన్న స్టాల్ ఫొటోలను షేర్ చేశారు.
దీని గురించి చెప్పగానే ఆహార ప్రియులకు వెంటనే నోరూరిపోయింది. కొందరు మేం ప్రయత్నిస్తాం అనగా.. మరికొందరు కోల్‌కతాలో ఆ ప్రాంతం ఎక్కడో చెప్పండంటూ హర్షను కోరారు. ఈ ట్వీట్‌పై పేటీఏం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ కూడా స్పందించారు. ‘కొత్త రుచులు. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను!’ అంటూ వ్యాఖ్యను జోడించారు. మరికొందరు ఇది ఏయే ప్రాంతాల్లో దొరుకుందో కూడా చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.