
Published : 16 Nov 2021 01:20 IST
Haryana: పెళ్లి కావాలంటూ టవరెక్కిన యువకుడు
కర్నాల్: హరియాణాలోని కర్నాల్ పట్టణంలో ఓ యువకుడు తనకు పెళ్లి చేయాలంటూ.. మద్యం మత్తులో సెల్ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని కుటుంబసభ్యులను బెదిరించాడు. స్థానికులు కిందకు దింపే ప్రయత్నం చేసినా యువకుడు ఒప్పుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడి స్నేహితుల సాయంతో అతికష్టం మీద కిందకి దించారు. ఈ డ్రామా సుమారు రెండు గంటల పాటు నడిచింది.
ఆయితే గత శుక్రవారం కూడా టవర్ ఎక్కడానికి ఆ యువకుడు ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుడు అతడి స్నేహితులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. మద్యానికి బానిసైన తన కుమారుడు రోజూ తాగి గొడవ పెట్టుకుంటున్నాడని అతడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా నిత్యం మద్యం సేవించే వాడికి ఎలా పెళ్లి చేయాలని ఆమె వాపోయారు.
ఇవీ చదవండి
Tags :