HYD: పంజాగుట్ట నిమ్స్‌లో గుండెమార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం 

నగరంలోని పంజాగుట్ట నిమ్స్‌లో ఇవాళ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.

Updated : 16 Sep 2021 01:16 IST

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్ట నిమ్స్‌లో ఇవాళ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మలక్‌పేట యశోద ఆసుపత్రి  నుంచి ఇవాళ మధ్యాహ్నం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిమ్స్‌కు తరలించారు.  మధ్యాహ్నం 2.15గంటలకు నిమ్స్‌లో ప్రారంభమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స రాత్రి 7గంటలకు ముగిసింది. దాదాపు 5గంటల పాటు గుండె మార్పిడి చికిత్స జరిగింది. ప్రస్తుతం గుండె అమర్చిన పెయింటర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇక్కడ పలుమార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. గుండె కోసం పెయింటర్‌ అయిన రోగి జీవన్‌దాన్‌లో నిన్న నమోదు చేసుకున్నారు. ఇంత త్వరగా రోగికి గుండె దొరకడం అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని