Polavaram: ముంపులో 38 గ్రామాలు.. ప్యాకేజీ కోసం బాధితుల ఆవేదన

గోదావరి వరద ఉద్ధృతికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 38 గ్రామాలు

Updated : 26 Jul 2021 13:52 IST

దేవీపట్నం: గోదావరి వరద ఉద్ధృతికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 38 గ్రామాలు నీట మునిగాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు వెళ్లినప్పటికీ.. చాలా గ్రామాలకు చెందిన నిర్వాసితులు ప్యాకేజీ చెల్లించే వరకే ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. పోలవరం కాఫర్‌ డ్యాం పూర్తవడంతో గోదావరి వెనుక జలాలు దేవీపట్నం మండలంలోని పి. గొందూరు, పూడిపల్లి, తాళ్లూరు, కొండమొదలు, చిన్న రమణయ్యపేట, సీతారం గ్రామాలను ముంచేశాయి. నివాసాలన్నీ నీటితో మునిగిపోవడంతో కొందరు ఇళ్ల పైకప్పులపై, సమీప కొండ ప్రాంతంలో తల దాచుకుంటున్నారు.

త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని వరద నీటి నుంచి బయటకు రావాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ సింహాచలం, తాహసీల్దార్ వీర్రాజు ప్రజలను కోరారు. కాగా, పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇస్తేనే బయటకు వస్తామని వారు చెబుతున్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులమైన మాకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తారని నమ్మి వైకాపాకు ఓట్లు వేశాం. తీరా నెగ్గిన తర్వాత మొండిచేయి చూపించారు’’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని