AP News: గోదావరికి పోటెత్తిన వరద.. విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం

గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.

Updated : 25 Jul 2021 12:42 IST

చింతూరు: గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయానికి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో రెండు బృందాలు, వీఆర్‌ పురానికి ఒక సహాయబృందాన్ని పంపారు. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచించారు. పోలవరం వద్ద కూడా గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. స్పిల్‌వే వద్ద 32.8 మీటర్లకు వరద చేరింది.

మరోవైపు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట నుంచి లక్షల క్యూసెక్కుల్లో నీరు దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో గౌతమీ నదీపాయకు వరద పోటెత్తింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో వివిధ కాలనీలను నీరు చుట్టుముట్టంది. యానాం డిప్యూటీ కలెక్టర్‌ అమన్‌శర్మ పరిస్థితిని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని