Bogatha Waterfall: భారీ వర్షాలు.. ‘బొగత’ పరవళ్లు 

ఎగువ ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని

Updated : 07 Sep 2021 13:54 IST

వాజేడు: ఎగువ ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని చీకులపల్లి వాగుకు నీటి ప్రవాహం పోటెత్తింది. దీంతో బొగత జలపాతం వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షాల వల్ల కొనసాగుతున్న వరదతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొత్త అందాలతో చూపరులను కనువిందు చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని