ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద: పేర్ని నాని

ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది...

Published : 01 Aug 2021 17:30 IST

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు లక్ష క్యూసెక్కులు, రేపటి వరకు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందును కృష్ణా నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఎవరూ నదిలో దిగవద్దని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని