AP News: విస్తారంగా వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద

ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.

Updated : 24 Jul 2021 10:54 IST

సున్నిపెంట సర్కిల్: ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,48,881 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853 అడుగులకు నీరు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 86.8390 టీఎంసీలుగా నమోదైంది. నీటి లభ్యతతో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని