TS News: హైదరాబాద్‌ శివారులో భారీగా పొగమంచు..

 తెలంగాణలో పలుప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9 గంటలు

Updated : 26 Dec 2021 10:06 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: తెలంగాణలో పలుప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా దీని ప్రభావం ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొద్దిదూరంలో ఏముందో కూడా కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్తున్నారు. దీంతో హైవేలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు