Published : 21 Nov 2021 01:16 IST

Ap News: ఏపీలో  వర్ష బీభత్సం.. నష్టం ఎంతంటే?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను తుఫాన్లు వెంటాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఈ నష్టంపై ప్రభుత్వం ప్రాథమికంగా అధికారిక గణాంకాలను వెల్లడించింది. నాలుగు జిల్లాల్లోని 172 మండలాలపై వర్షాల ప్రభావం పడిందని తెలిపింది. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 24 మంది మృతిచెందగా.. 17మంది గల్లంతైనట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 66 మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరగ్గా..అనంతపురంలో 46, కడపలో 48 మండలాల్లో నష్టం వాటిల్లినట్టు తెలిపింది.  నాలుగు జిల్లాల్లో కలిపి 23,345 హెక్టార్లలో పంట నష్టం జరగగా.. 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయా జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం తక్షణ సాయంగా ₹7కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రిలీఫ్‌ క్యాంపుల్లోని వారికి కుటుంబానికి ₹2వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపింది. రహదారులు, విద్యుత్‌ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు స్పష్టంచేసింది. 

తిరుమలలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం!

భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹4కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో గత 30 ఏళ్లలో ఎప్పుడూలేనంత వర్షం పడిందన్నారు. తిరుమలలో జరిగిన నష్టం వివరాలను ఆయన వివరించారు. ‘‘ఘాట్‌ రోడ్‌లోని 13చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్‌ రోడ్డులో ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఘాట్‌రోడ్లు, మెట్ల మార్గంలో వెంటనే మరమ్మతు పనులు చేపడతాం. నారాయణగిరి అతిథిగృహం, కపిలతీర్థం మండపం దెబ్బతిన్నాయి.  తిరుమల వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తాం’’ అని సుబ్బారెడ్డి  తెలిపారు. 

సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే..

భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ₹5లక్షల చొప్పున ఇటీవల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం.. నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్నానదికి రికార్డుస్థాయిలో వరద ప్రవాహం పెరగడంతో అనేక గ్రామాలను ఖాళీ చేయించి వేలాది మంది ప్రజల్ని సహాయక శిబిరాలకు తరలించారు. నందలూరు-రాజంపేట మార్గంలో పట్టాలపైకి నీరుచేరి దెబ్బతినడంతో దక్షిణ మధ్యరైల్వే జీఎం గజానన్‌ మాల్యా పరిశీలించారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని