Hyderabad: ‘గులాబ్’ ఎఫెక్ట్.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం
గులాబ్ తుపాను తీవ్రత తెలంగాణపై చూపిస్తోంది. తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని
హైదరాబాద్: గులాబ్ తుపాను తీవ్రత తెలంగాణపై చూపిస్తోంది. తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్, తుర్కయాంజాల్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడా, హిమాయత్‌నగర్, లక్డికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, చార్మినార్, చంద్రాయానగుట్ట, బహదూర్‌పురా, యకుత్పురా తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.
బొరబండ, అల్లాపూర్, మోతీ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఈఎస్ఐ, వెంగల్ రావు నగర్, రహమత్ నగర్, అమీర్‌పేట, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్-హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
ఏ సమస్య ఉన్నా డయల్ 100: హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా డయల్ 100కి ఫోన్ చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీపై దృష్టిపెట్టినట్టు చెప్పిన ఆయన.. పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ఇద్దరు అధికారులతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి సాయం కోసమైనా హైదరాబాద్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 040-23202813ను సంప్రదించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ