AP News: రాత్రి 10గంటలు దాటినా.. దుర్గదర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు...

Updated : 12 Oct 2021 22:59 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి తోడు వీఐపీలు కూడా భారీగా రావడంతో క్యూలైన్లలో భక్తులను అదుపు చేయలేక పోలీసులు ఒక దశలో చేతులెత్తేశారు. భక్తులు బారికేడ్లు తోసుకుంటూ ఆలయంలోకి చొచ్చుకొచ్చారు. నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగి వీఐపీ క్యూలైన్‌ను అదుపు చేశారు. వీఐపీలు దర్శనానికి వెళ్లే మార్గం నుంచే భక్తులు తిరిగి బయటకు వస్తుండటంతో మరింత రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు ప్రకటించారు. రాత్రి 10 గంటల సమయానికి కూడా కొండపై నుంచి రథం సెంటరు వరకు భక్తులు క్యూలైన్‌లోనే ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ నివాస్‌ రెవెన్యూ అధికారులు కొండపైకి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. రద్దీ నియంత్రణకు అధికారులు క్యూలైన్లను క్రమబద్ధీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని