AP NEWS: కృష్ణా తీరంలో హై అలర్ట్
ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో ఆకస్మికంగా నీటి ప్రవాహం
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువున ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంతో ప్రాజెక్టులోని నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. గేటు మరమ్మతు కోసం ప్రాజెక్టును ఖాళీ చేస్తుండటంతో భారీగా నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం వరకూ 59 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ప్రవాహం పెరుగుతున్న కొద్దీ నీటి విడుదలను పెంచారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1.12లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు, కాలువలకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ దిగువకు 1.3లక్షల క్యూసెక్కులు, ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు గుంటూరు ఛానల్‌కు మొత్తంగా 9,689 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రవాహాలు మరింతగా పెరిగే అవకాశముండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. దిగువన కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి 1.12లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల ప్రాజెక్టుకు కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. పులిచింతల ఔట్ ఫ్లో గురువారం సాయంత్రానికి 4.97లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6లక్షల క్యూసెక్కులకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. అంతకు మించితే కృష్ణా తీర గ్రామాలు ముంపు బారిన పడే ప్రమాదముంది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 34.67 టీఎంసీలుగా ఉంది. నీటి నిల్వ 10 టీఎంసీలు తగ్గితే స్టాప్‌లాక్ గేటు ఏర్పాటుకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. దీంతో పెద్దమొత్తంలోనే రిజర్వాయర్ నుంచి నీటిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ప్రాజెక్టుకు భారీ వరద వల్ల గేటు ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్..?
-
Sports News
IND vs AUS: టీ బ్రేక్.. స్వల్ప వ్యవధిలో వికెట్లు ఢమాల్.. ఆసీస్ స్కోరు 174/8 (60)
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్
-
India News
Mallikarjun Kharge: వాజ్‌పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు