AP High Court: జీవోలపై నూతన విధానం ఎందుకు?: ఏపీ హైకోర్టు

ఏపీలో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 100ను

Published : 30 Sep 2021 13:29 IST

అమరావతి: ఏపీలో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 100ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఈ అంశంపై పిటిషన్‌లు దాఖలు చేశారు. ఏపీ ఈ- గెజిట్‌లో జీవోలు ఉంచుతామని ప్రభుత్వం చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. వారానికి ఒకసారే జీవోలు ఉంచడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాది వై. బాలాజీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

కాన్ఫిడెన్షియల్‌ పేరుతో జీవోలు దాచిపెట్టడం చట్టానికి వ్యతిరేకమని న్యాయవాది వాదించారు. ఇది సమాచార హక్కు చట్టం ప్రకారం విరుద్ధమన్నారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. జీవోలపై నూతన విధానం ఎందుకు తీసుకొచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అక్టోబర్‌ 27వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 27కు హైకోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని