Ap News: సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుపై హైకోర్టులో విచారణ

సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మార్కెట్‌లో రూ.2.05కు వస్తుంటే రూ.2.45కు కొనడాన్ని

Updated : 20 Dec 2021 17:26 IST

అమరావతి: సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మార్కెట్‌లో రూ.2.05కు వస్తుంటే రూ.2.45కు కొనడాన్ని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు. సెకీ ద్వారా రాష్ట్రానికి విద్యుత్‌ ఇచ్చేందుకు అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం కేంద్రం, అదానీ సంస్థ, రాష్ట్ర ఇంధన శాఖ సహా 10 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని