Ts News: మరియమ్మ లాకప్‌డెత్‌ కేసు.. సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదన్న ఏజీ

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్‌ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఎస్పీ కల్యాణ్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

Updated : 22 Nov 2021 20:33 IST

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్‌ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఎస్పీ కల్యాణ్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని విచారణ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మార్గదర్శకాల ప్రకారమే దర్యాప్తు జరిపిస్తామని ఏజీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారని చెప్పారు. ఇంకా ఎవరైనా బాధ్యులుగా తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరియమ్మ మృతిపై సీఐడీ దర్యాప్తునకు సిద్ధమేనని.. అయితే సీబీఐకి అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపారు. రాష్ట్ర పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పు రిజర్వ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని