TS News: పోడు భూముల వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

గిరిజనుల పోడు భూములపై హక్కుల క్రమబద్దీకరణకు రక్షిత అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ..

Published : 27 Nov 2021 22:11 IST

హైదరాబాద్‌: గిరిజనుల పోడు భూములపై హక్కుల క్రమబద్దీకరణకు రక్షిత అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూముల్లో సాగు చేస్తున్న వారికి వ్యక్తిగత హక్కులను మాత్రమే క్రమబద్దీకరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలంటూ ఈనెల 2న ములుగు కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గోవిందరావుపేటకు చెందిన అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్‌ఓఎఫ్ఆర్‌ ప్రకారం వ్యక్తిగత హక్కులతో పాటు సామాజిక, గ్రామసభలపై హక్కులు కల్పించేలా దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం పోడు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టిందన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా ప్రక్రియ నిర్వహిస్తున్నారన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ డిసెంబరు 7కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని