Updated : 23 Nov 2021 16:03 IST

TS News: వెంకట్రామరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏజీ

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. వరివిత్తనాలు వేయొద్దని.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా పట్టించుకోబోమని గతంలో వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారనే ఆరోపణలున్నాయి.  ఈ విషయంలో సింగిల్‌ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.  దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామరెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే దీనిపై ఏజీ స్పందిస్తూ వెంకట్రామరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణ హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని