Ts News: నోటిఫికేషన్ తప్పుదోవ పట్టించేలా ఉంది.. పుప్పాలగూడ ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే

రాజేంద్రనగర్‌ పరిధిలోని పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలం నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పుప్పాలగూడలోని 301, 302, 303 సర్వే నంబర్లలోని

Updated : 21 Sep 2021 21:56 IST

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ పరిధిలోని పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలం నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పుప్పాలగూడలోని 301, 302, 303 సర్వే నంబర్లలోని ప్లాట్లను ఈనెల 28న వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేలానికి సంబంధించి గతనెల 30న టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే సర్వే నంబరు 301లోని భూమిని వేలం వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లక్ష్మీ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. కాందిశీకుల నుంచి తాము కొనుగోలు చేసిన భూములు 301 సర్వే నంబరులో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్ల భూమలు వేలం వేయడం లేదంటూనే నోటిఫికేషన్‌లో 301 సర్వే నంబరును ప్రస్తావించారని తెలిపింది. నోటిఫికేషన్ తప్పుదోవ పట్టించేలా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. సర్వే నంబరు 301లోని 25, 26, 28, 29, 30 ప్లాట్ల వేలంపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏలకు నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని