HYD: ట్యాంక్‌బండ్‌పై రాకపోకల పునరుద్ధరణ: అంజనీకుమార్‌

నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై ఇరు వైపులా సాధారణ రాకపోకలను పునరుద్ధరించినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ యాదవ్ తెలిపారు.

Updated : 20 Sep 2021 11:01 IST

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై ఇరు వైపులా సాధారణ రాకపోకలను పునరుద్ధరించినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి తెలుగుతల్లి ఫైఓవర్‌, ఖైరతాబాద్‌ వైపు వాహన రాకపోకలకు మార్గాలు తెరిచినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధి నుంచి గణపతి విగ్రహాల రద్దీ ఉన్నట్లు ఆయన వివరించారు. అందువల్ల పీవీ మార్గ్‌లో గణపతి నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఆ రహదారి కూడా క్లియర్‌ చేస్తామని చెప్పారు. మిగిలిన అన్ని రహదారుల్లో యథావిధిగా రాకపోకలు సాగుతున్నాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని