Ap News: అనేక మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ర్యాంకర్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన ఐఐటీ ర్యాంకర్లను అభినందించిన

Updated : 26 Oct 2021 19:31 IST

అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ర్యాంకర్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన ఐఐటీ ర్యాంకర్లను అభినందించిన సీఎం జగన్‌.. విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనేక మంది ఐఏఎస్ అధికారులు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే అని అన్నారు. అలాంటి ఐఏఎస్‌లను చూసి ఐఐటీ ర్యాంకర్లు స్ఫూర్తి పొందాలన్నారు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని