Published : 15 Aug 2021 11:59 IST

TS News : హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్‌ : 75వ స్వాతంత్ర్య వేడుకలు రాష్ట్ర హైకోర్టులో ఘనంగా జరిగాయి. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడారు. ‘ఈ ఏడాది కరోనా రెండో దశ తీవ్ర పభావం చూపింది. హైకోర్టులో 240, జిల్లాల్లో 1288 న్యాయ సిబ్బంది, 2235 న్యాయవాదులు కరోనా బారిన పడ్డారు. కరోనాతో 19 మంది ఉద్యోగులు, 208 న్యాయవాదులు మరణించారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ఆయా కుటుంబాల్లోని అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ సిబ్బంది సహకారంతో కోర్టులను నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. 8300 సిబ్బందికి, 2900 న్యాయవాదులకు వ్యాక్సిన్లు ఇచ్చాం. ఈ ఏడాది 31,168 కొత్త పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ సంవత్సరం 22,098 కేసులు పరిష్కరించాం. హైకోర్టులో 2.32లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జడ్జీలను పెంచాలని కేంద్రాన్ని హైకోర్టు ఎప్పటి నుంచో కోరుతోంది. సీజేఐ జస్టిస్ ఎన్‌.వి. రమణ వ్యక్తిగత చొరవతో హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది. దీర్ఘకాలిక పెండింగ్ అంశాన్ని పరిష్కరించిన సీజేఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు. హైకోర్టు జడ్జీల నియామకం కోసం కొన్ని పేర్లు పంపించాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తికరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 46 కొత్త కోర్టులు, 2170 అదనపు పోస్టులు, 213 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేసింది. 33 జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది. కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ పాక్షికంగా పునరుద్ధరించాం. వీలైనంత త్వరలో పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని భావిస్తున్నాం’ జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని