TS News: తెలంగాణలో 20 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

తెలంగాణకు చెందిన 20మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నుంచి ఇండియన్‌ పోలీసు సర్వీసుకు వారిని నియమించారు.

Updated : 21 Dec 2021 19:44 IST

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన 20మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నుంచి ఇండియన్‌ పోలీసు సర్వీసుకు వారిని నియమించారు. 2016 నుంచి 2020 బ్యాచ్‌లకు చెందిన మొత్తం 20 మందికి ఐపీఎస్‌ హోదా దక్కింది. 2016 బ్యాచ్‌లో కోటిరెడ్డి, సుబ్బరాయుడు, నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, అన్నపూర్ణ, పద్మజ, జానకి ధరావత్‌ ఉన్నారు. 2017 బ్యాచ్‌కు చెందిన పి.యాదగిరి, 2018 బ్యాచ్‌కు చెందిన కేఆర్‌ నాగరాజు, ఎం.నారాయణ, 2019 బ్యాచ్‌కు చెందిన  వి.తిరుపతి, ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, డి.ఉదయ్‌ కుమార్‌రెడ్డి, కె.సురేష్‌ కుమార్‌ పేర్లు జాబితాలో ఉన్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించి బి.అనురాధ, సి.అనసూయ, షేక్‌ సలీమా, ఆర్‌.గిరిధర్‌, సి.హెచ్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. ఐపీఎస్‌ నిబంధనలకు లోబడి ఈ అధికారులందరూ ఏడాదిపాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని