AP News: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఏపీ ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లు బదిలీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ..

Updated : 14 Jul 2021 12:53 IST

అమరావతి:  ఏపీ ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లు బదిలీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌ దేవ్‌ శర్మ, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశాలు అందాయి. ఆక్టోపస్‌ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్‌, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్‌, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్‌, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌, కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వకుల్‌ జిందాల్‌, మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అజితా వేజెండ్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని