Rajat Kumar: తెలంగాణ ఉద్యమం ప్రధానంగా జరిగిందే నీళ్ల కోసం: రజత్‌ కుమార్‌

తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల కోసం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు.

Updated : 01 Sep 2021 15:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల కోసం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నీటి అవసరాలు తీరాలంటే విద్యుత్‌ ఉత్పత్తి అవసరమని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణాజలాల్లో వాటా ఖరారు ప్రధాన ఎజెండాగా కాసేపట్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) భేటీ జరగనుంది. సమావేశం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరు కృష్ణా జలాలు అని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. బేసిన్‌ వెలుపలకు కృష్ణా జలాలను తరలిస్తోందన్నారు. రాష్ట్ర అవసరాలతో పోలిస్తే ఇది వరకు తెలంగాణకు ప్రతిపాదించిన 299 టీఎంసీల కేటాయింపులు చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణా నదిపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని