ap news: గెజిట్‌ను స్వాగతిస్తున్నాం: ఏపీ
అమరావతి: తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అక్టోబరు 14 నుంచి జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందన్నారు. బేసిన్ పరిధిలో లేని వాటినీ నోటిఫికేషన్లో పేర్కొన్నారని, వాటిని సవరించాల్సి ఉందన్నారు. వెలుగొండపై తలెత్తిన అక్షర దోషాలను సవరించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
‘‘సాగునీరు విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. విద్యుత్ ఉత్పత్తి కోసం సాగునీరు విడుదల చేయకూడదు. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 30.38 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంటే, అందులో 29.82టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 806.8 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 854 అడుగులు ఉండాలి. దీంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన 8టీఎంసీల నీరు సముద్రం పాలైంది. జూన్ నుంచి ఇప్పటివరకు తెలంగాణ 66 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడింది. దీనిపై సీఎం జగన్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ పరిధి నిర్ణయించడంతో పాటు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత బోర్డు పరిధిలో ఉండేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఈ క్రమంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం’’ అని శ్యామలరావు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
-
General News
Andhra news: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్ల ఎత్తివేత
-
Sports News
Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
-
Crime News
Crime News: చేపల వేటకు వెళ్లి ఒకరు.. కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు గల్లంతు
-
Movies News
Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
-
General News
Weight Loss: లావుగా ఉన్నామని చింతిస్తున్నారా...? ప్రత్యామ్నాయం ఉంది కదా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?