Birthday: భార్య పుట్టినరోజు మర్చిపోయారా..? అక్కడ జైలు పాలైనట్లే..!

ఏంటీ.. భార్య పుట్టినరోజు మర్చిపోతే  జైలుకెళ్లాలా..? మర్చిపోకుండా ఎలా ఉంటారు..? అప్పుడప్పుడు పనుల్లో పడి మర్చిపోతుంటాం. అయినా జైలుకెళ్లడం ఏంటి..? ఇదెక్కడి అన్యాయం? అని అనిపిస్తుందా..!

Updated : 06 Dec 2021 19:19 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఏంటీ.. భార్య పుట్టినరోజు(Birthday) మర్చిపోతే జైలుకెళ్లాలా..? మర్చిపోకుండా ఎలా ఉంటారు..? అప్పుడప్పుడు పనుల్లో పడి మర్చిపోతుంటాం. అయినా జైలుకెళ్లడం ఏంటి..? ఇదెక్కడి అన్యాయం? అని అనిపిస్తుందా..! కానీ సమోవా దేశంలో మాత్రం ఇంతే..! అక్కడి ప్రభుత్వం భార్యల విషయంలో భర్తలు అజాగ్రత్తగా ఉంటే ఊరుకోదట.

సమోవా దేశంలో ఎవరైనా తన సతీమణి పుట్టినరోజును పొరపాటున మర్చిపోతే అక్కడ నేరంగా పరిగణిస్తారు. దీనిపై భార్య ఫిర్యాదు చేస్తే.. భర్త జైలుకెళ్లాల్సిందే. అది మొదటి సారే అయితే.. పోలీసులు హెచ్చరించి వదిలేస్తారు. మరోసారి ఇలా జరగొద్దంటూ సూచనలు చేస్తారు. ఒకవేశ దురదృష్టం కొద్ది ఇంకోసారి కూడా మర్చిపోయారా ఇంక అంతే. జైల్లో కూర్చోవాల్సిందే. తన అర్ధాంగి పట్ల భర్త నిర్లక్ష్యం చూపకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

మరికొన్ని దేశాల్లో కూడా ఈ తరహా విచిత్ర చట్టాలున్నాయి తెలుసా..! 

బ్లూ జీన్స్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వస్తే ఉత్తర కొరియాలో చట్టవిరుద్ధం. తూర్పు ఆఫ్రికాలో జాగింగ్ చేయకూడదు. దానిపై అక్కడ నిషేధం ఉంది మరి. సింగపూర్‌లో చూయింగ్ గమ్స్‌ తినకూడదు. వాటివల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూఎస్ రాష్ట్రం ఓక్లహామాలో శునకాన్ని దూషించకూడదట. ఇటలీలోని మిలాన్ నగరంలో ముఖం చిట్లిస్తే నేరం. ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అంత్యక్రియల సమయంలో మినహా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని